9 July, 2026 | 4:48 AM

పీజీఐలో తెలంగాణకు ర్యాంకింగ్

09-07-2026 01:01 AM

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పర్‌ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇన్‌డెక్స్ 2.0 (పీజీఐ 2.0)లో తెలంగాణ ముందుకు దూసుకువచ్చింది. 1000 స్కోరుకు గానూ రాష్ట్రం స్కోరు 2024- 552.5గా ఉండగా, 2025- అది 599.7కి చేరుకుంది. ఫలితంగా గతంలో 31 స్థానంలో నిలిచిన రాష్ట్రం ఇప్పుడు అయిదు స్థానాలు అధిగమించి 26వ స్థానానికి చేరుకుంది. గతంలో ఆకాంక్షి- విభాగంలో ఉన్న రాష్ట్రం ప్రస్తుతం ప్రచేష్ట- చేరుకుంది.

విద్యా ప్రమాణాలు పెరగడంతో గతంలో ఉన్న స్థానం కంటే కనీసం ఒక్కో స్థానాన్ని రాష్ట్రంలోని జిల్లాలు మెరుగుపర్చుకున్నాయి. ఈ గ్రేడింగ్‌లో ఏ జిల్లా కూడా గతం కంటే తక్కువ స్థానానికి పడిపోలేదు. ప్రతి పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధన జరగడమే ప్రస్తుత ర్యాంకింగ్ పెరగడానికి కారణమైంది. తెలంగాణలోని 33 జిల్లాల్లో జనగాం, మంచిర్యాల వరుసగా 383, 360 స్కోరుతో ఉత్తమ్- విభాగంలో నిలిచాయి. విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఉత్తమ విద్యా విధానాల అధ్యయనానికి రాష్ట్రంలోని టీచర్లను ఫిన్లాండ్, జర్మనీ దేశాల పర్యటనలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది.