డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు
11-05-2026 06:05 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘విద్యా వారోత్సవాలు’సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి గోడ పత్రిక, ఫ్లెక్సీల ఆవిష్కరణ ప్రిన్సిపల్ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేటి నుండి మే 17 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.






