30 July, 2026 | 1:15 AM

ఏకగ్రీవంగా తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం రాష్ట్ర కార్యవర్గం

30-07-2026 12:12 AM

ముకరంపుర, జూలై 29 (విజయ క్రాంతి): తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం రాష్ట కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం నగరంలో నిర్వహించిన సంఘం సర్వసభ్య సమావేశంలో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అధ్యక్షులుగా దాస్యం సేనాధిపతి, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా అన్నాడి గజేందర్ రెడ్డి, చిందం సునిత, బొమ్మకంటి కిషన్, గంప ఉమాపతి, కోశాధికారిగా అనుముల దయాకర్ లను ఎన్నుకున్నారు. అలాగే సంయుక్త కార్యదర్శులుగా నాగేంద్ర శర్మ, గుర్రం మాధవ్, నీలగిరి అనిత, మహిళా కార్యదర్శిగా మామిడాల శైలజ, ప్రచార కార్యదర్శిగా గుండు రమణయ్య, కార్యవర్గ సభ్యులుగా దాస్యం లక్ష్మయ్య, బుర్రా విజయలక్ష్మీ, హరి ప్రసాద్ శర్మ, వేణు గోపాల్, సిహెచ్ సంగీత, టి. జగన్మోహన్, ఎం డి ఖాలీద్ లను ఎన్నుకున్నారు.