భగత్‌నగర్ ఇంటి డెకాయిటీ కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు
- బాధితుడి సొంత అల్లుడు, మనుమడే ప్రధాన సూత్రధారులు
- మీరట్ కు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్
కరీంనగర్ క్రైం, జూలై 29 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరంలోని భగత్నగర్లో ఇటీవల జరిగిన ఇంటి డెకాయిటీ కేసును కరీంనగర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్కు చెందిన ముగ్గురు నిందితుల ను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 2,09,000 రూపాయల నగదు, 43.67 గ్రాముల బం గారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
భగత్ నగర్ కు చెందిన ఎండి అజ్మత్ అలీ నివాసంలో ఈనెల 21న అర్ధరాత్రి సమయంలో దుండగులు డమ్మీ పిస్ట ళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి, వారి చేతులు, కాళ్లు కట్టేసి ఇం ట్లోని నగదు, బంగారం, వెండి ఆభరణాల ను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘ టనా స్థలం, నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు.
నిందితులు దోపిడీ అనంతరం దొంగిలించిన ద్విచక్ర వాహనాలపై హుజురాబాద్ వైపు వెళ్లి పెద్ద పాపయ్యపల్లి సమీపంలో వాటిని వదిలివెళ్లినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితు లు ఉత్తరప్రదేశ్లోని మీరట్ కు చెందిన వారని పోలీసులు నిర్ధారించారు.
కరీంనగర్ పోలీసుల ప్రత్యేక బృందాలు మీరట్ కు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్ కు వెళ్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ అలియాస్ భూరే అలియాస్ యాదవ్(22), సల్మాన్ అలియాస్ విమాన్ (22), మొహమ్మద్ హసీన్ (19)లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి నగదు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
- సొంత అల్లుడు, మనుమడే కుట్రకు సూత్రధారులు&
దర్యాప్తులో బాధితుడు ఎండి అజ్మత్ అలీ సొంత అల్లుడు రజావుద్దీన్, మనుమ డు అజీమ్ రజా ఈ డెకాయిటీకి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. రజావుద్దీన్ పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసుల తో పాటు ఇతర నేర కేసులు నమోదై ఉన్నా యి. కుటుంబ కలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి వెళ్లాడు. అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు.
అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వ ద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల 5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బా ధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు. కరీంనగర్లో బాధితుడి ఇంట్లో నివసించిన సమ యంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా, మీరట్ కు చెందిన మరో ముగ్గురితో కలిసి పథకం రచించాడు.
ఈ నెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21 అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు. అరెస్టయిన ముగ్గురు నిందితులను మీరట్ న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారె్ంప కరీంనగర్కు తరలిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు రజావుద్దీన్, అజీమ్ రజాతో పాటు ఇతర నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.






