11 March, 2026 | 11:07 PM

పది విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు

11-03-2026 07:14 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): స్థానిక సారపాక బ్రిలియంట్ విద్యాసంస్థల నందు పదో తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఘనంగా వీడ్కోలు అభినందన సభను బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ గురుబ్రహ్మ అవార్డు గ్రహీత డాక్టర్ బి.ఎన్.ఆర్ విచ్చేయగా హెడ్ మిస్సెస్ స్వర్ణ కుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ... పాఠశాల విద్యను ముగించుకొని కళాశాల విద్యలోకి అడుగుతున్న మాకు ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చినటువంటి పాఠశాల యాజమాన్యంకు ఉపాధ్యాయులుకు, స్నేహితులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. మంచి మాటలను ఉత్తమ నడవడికను నేర్పిన గురువులను ఎన్నటికీ మర్చిపోలేము అని వారి భావాలను వ్యక్తపరిచారు.

అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధనను, భవిష్యత్ గురించి దిశా నిర్దేశం చేసారు. అనంతరం డాక్టర్ బి.ఎన్.ఆర్  మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు పదవ తరగతిలోనే ప్రారంభమవుతుందన్నారు.విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లాలంటే మంచి నడవడికతో పాటు గురువులు, తల్లిదండ్రుల పట్ల గౌరవం, క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు తేవాలని కోరుతూ అందర్నీ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.