11 March, 2026 | 9:25 PM

తాడూర్ రైతు వేదికలో రైతులకు వ్యవసాయ అవగాహన కార్యక్రమం

11-03-2026 07:09 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని తాడూర్ రైతు వేదికలో అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ATMA) ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా రసాయన ఎరువుల వినియోగం, ఆయిల్ పామ్ సాగు, ప్రకృతి వ్యవసాయం, కూరగాయల సాగు వంటి అంశాలపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ ప్రదీప్, మండల వ్యవసాయ అధికారి సంజీవ్, ఏఈఓ, ప్రజాప్రతినిధులు మరియు క్లస్టర్ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతులు ఆధునిక పద్ధతులను అనుసరించి వ్యవసాయం చేయాలని అధికారులు సూచించారు.