హెచ్‌సీఏపై బీసీసీఐకి టీసీఏ ఫిర్యాదు
హైదరాబాద్ , ఏప్రిల్ 28 : తెలంగాణ టీ 20 లీగ్ పేరుతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన టోర్నమెంట్ నిబంధన లకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీసీఐ నుండి ముందస్తు లిఖిత పూర్వక అనుమతులు వెల్లడించకుండా, బీసీసీఐ రాజ్యంగం ప్రకారం హెచ్‌సీఏ జనరల్ బాడీ అధికారిక అనుమతి లేకుండానే ఈ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం పూర్తిగా చట్ట విరుద్ధమని పేర్కొంది.
నిపై బీసీసీఐకు ఫిర్యాదు చేసినట్టు టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి చెప్పారు. ఈ వ్యవహారం ఇప్పటికే బాంబే హైకోర్టులో పెండింగులో ఉండగా, హెచ్‌సీఏ ఏకపక్ష చర్యలు కోర్టు పర్యవేక్షణలో ఉన్న ప్రక్రియను దాటవేసే ప్రయత్నమని టీసీఏ పేర్కొం ది. టోర్నమెంట్ బీసీసీఐ అనుమతితో జరిగితే గత ఉత్తర్వుల ప్రకారం టీసీఏతో పాటు తెలంగాణ జిల్లాల క్రికెటర్లను తప్పనిసరిగా చేర్చా లని గుర్తు చేశారు. కోర్టు లేదా బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు లేకుండా హెచ్‌సీఏ ఏకపక్షం గా ముందుకు వెళ్లలేదని టీసీఏ స్పష్టం చేసిం ది.
ఒకవేళ టోర్నమెంట్ అనుమతి లేనిదైతే దీనిలో పాల్గొనే ఆటగాళ్లు, అధికారులపై చర్య లు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. తద్వారా వారి భవిష్యత్ కెరీర్లు దెబ్బతినే అవకాశముందని హెచ్చరించింది. దీనికి పూర్తి బాధ్యత హెచ్‌సీఏ, దాని గవర్నింగ్ కౌన్సిల్ సంబంధిత అధికారులదేనని పేర్కొంది.






