15 June, 2026 | 2:01 AM

కొమ్మల సాకుతో చెట్లకే ఎసరు..

15-06-2026 12:46 AM

24 గంటలు చీకట్లోనే!

మొయినాబాద్, జూన్ 14(విజయక్రాంతి) సురంగల్ గ్రామంలో వర్షానికి విరిగిన చెట్టు కొమ్మలను తొలగించే సాకుతో మున్సిపల్ సిబ్బంది జేసీబీతో చెట్లను వేర్లతో సహా పీకేశారు. ఈ క్రమంలో విద్యుత్, ఇంటర్నెట్ కేబుళ్లు తెగిపోవడంతో 14వ వార్డు ప్రజలు దాదాపు 24 గంటల పాటు అంధకారంలో, ఉక్కపోతతో నరకం చూశారు. 20 ఏళ్లుగా పెంచుకున్న చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయగా, జేసీబీలతో చెట్లను పీకేసే విధానం తమది కాదని విద్యుత్ శాఖ ఏఈ స్పష్టం చేశారు. ఎట్టకేలకు 24 గంటల తర్వాత సరఫరా పునరుద్ధరించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.