2.9 కిలోల గంజాయి పట్టివేత
జనగామ, జూన్ 14 (విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలో సీఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో, ఎస్‌ఐ రతీష్ తో కలిసి జనగామ బస్ స్టాండ్ పరిసర ప్రాంతంలో వాహనాలను అనుమానిత వ్యక్తుల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను పరిశీలించగా, వారి వద్ద నుండి సుమారు 2.9 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన నిందితులు మిసాల శ్యామ్, కాశిబోయిన గౌతమ్, గుండా కార్తీక్. నిందితులను అదుపులోకి తీసుకుని జనగామ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారి పై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి ద ర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు మరియు వినియోగాన్ని అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా కొ నసాగుతుందని, ఇటువంటి చట్టవ్యతిరేక కా ర్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.






