మహిళా ప్రాధాన్య చిత్రం కోసం..!
తమిళ స్టార్ ధనుష్ మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారు. ఈసారి ఆయన ఫీమేల్ సెంట్రిక్ పీరియడ్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన భావిస్తున్నారన్న వార్తలు జోరుగా వినవస్తున్నాయి. ఇందులో కథానాయికగా మృణాల్ ఠాకూర్ పేరు వినిపించడంతో ఈ ప్రాజెక్టుపై అంతటా ఆసక్తి నెలకొంది. ఇటీవల ధనుష్-, మృణాల్ రిలేషన్‌లో ఉన్నారనన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ సందర్భంలో మృణాల్ స్పందిస్తూ తాము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనంటూ ఆ వార్తలను ఖండించింది.
ఆన్‌స్క్రీన్ జోడీల గురించి ఆఫ్‌స్క్రీన్ రూమర్స్ రావడం ఇండస్ట్రీలో సర్వసాధారణమే. అయితే, తాజాగా వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆ రూమర్స్‌కు బలం చేకూర్చినట్లయింది. ఇక ఈ తాజా ప్రాజెక్టు గురించి చెప్పా లంటే.. మహిళా ప్రాధాన్య కథల ట్రెండ్ ఇప్పుడు ఇండియన్ సినిమా మార్కెట్‌లో బలపడుతోంది. బలమైన కథతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తే బాక్సాఫీస్ వద్ద బాక్‌బస్టర్ విజయం ఖాయమని ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి.
స్టార్ పవర్ కంటే కంటెంట్‌కు ప్రాధాన్యం పెరుగుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇలాంటి జానర్ సినిమాలు చేయడమంటే బడ్జెట్ పరంగా పెద్ద రిస్క్‌తో కూడుకున్న పనే. ధనుష్ గతంలో యాక్టింగ్ చేస్తూ, డైరెక్షన్ బాధ్యతలు నిర్వర్తించిన సందర్భాల్లో ఫలితాలు మిశ్రమంగానే వచ్చాయి. ప్రస్తుతం నటుడిగా బిజీగా ఉన్న ఆయన మళ్లీ దర్శకత్వం వైపు దృష్టి మళ్లించిన నేపథ్యంలో అభిమానుల్లో క్వాలిటీపై సందేహాలు వ్యక్తమవుతు న్నాయి. ఏదేమైనా ధనుష్, మృణాల్ కలిసి పనిచేసే ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో భారీ క్రేజ్ క్రియేట్ కావడమైతే పక్కా.






