జెట్లీలో చిరంజీవి రిఫరెన్సులుంటాయ్
కమెడియన్ సత్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘జెట్లీ’. దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి చెర్రీ, హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. మే 1న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ బుధవారం లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సత్య మాట్లాడుతూ.. “ఇందులో క్యారెక్టర్ హీరోలా కాకుండా కామెడీ స్పెష్‌లోనే వుంటుంది. యాక్షన్ కామికల్‌గానే వుంటుంది. ఈ చిత్రంలో చిరంజీవి రిఫరెన్సులుంటా యి” అన్నారు. ‘నా పాత్ర ఎలా ఉంటుందో సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాన’ని హీరోయిన్ రియా సింఘా తెలిపారు.
డైరెక్టర్ రితేశ్ రానా మాట్లాడుతూ.. “ఇది యాక్టర్‌ను బట్టి రూపుదిద్దుకునే కథ. సత్య స్టయిల్ క్యారెక్టరైజేషన్ బట్టి స్క్రిప్ట్ డిజైన్ చేశాం. మిషన్ ఇంపాజిబుల్ సినిమా సత్యతో తీస్తే ఎలా వుంటుందో ‘జెట్లీ’ అలా వుంటుంది” అని చెప్పారు. నిర్మాత చెర్రీ మాట్లాడుతూ.. “దాదాపు 80 శాతం షూటింగ్ ఫ్లుటైలోనే చేశాం. నిజానికి ముందుగా పెద్ద హీరోతో ఇంటెన్స్ థ్రిల్లర్‌గా చేయాలనుకున్నాం. కుదరలేదు. తర్వాత కామెడీ థ్రిల్లర్‌గా మార్చాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వెన్నెల కిషోర్, శ్రీనివాస్‌రెడ్డి, గుండు సుదర్శన్ మాట్లాడారు.






