24 April, 2026 | 2:41 AM

పారదర్శకత జనగణనకు తహసీల్దార్లు చిత్తశుద్ధితో పనిచేయాలి

24-04-2026 01:19 AM

కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): జిల్లాలో జనగణనకు సంబంధించి తహసిల్దార్లు ప్రతి అంశంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, క్షేత్రస్థాయిలో  జనగణనకు సంబంధించి  ప్రత్యక్షంగా ఎదుర్కొనే అంశాలను ప్రశ్నలు సమాధానాల రూపంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అడిగి తెలుసుకున్నారు.

గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో వీడియో సమావేశ మందిరంలో గూగుల్ మీటి నిర్వహించి సంబంధిత తహసిల్దారులకు జనగణన, డ్రైలాండ్ వెట్ ల్యాండ్ సర్వే, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా తీసుకునే చర్యలు వచ్చే ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాలు పురుగు మందులు కొరత లేకుండా బఫర్ స్టాక్ ఏర్పాటు చేయడం, జిల్లాలో ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా నిర్వహణకు, సమర్థ  ఓటర్ మ్యాపింగ్, గృహ అవసరాల గ్యాస్ కొరత లేకుండా చూడటం, భూభారతి సాదా బైనామా పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, సంబంధిత అంశాలపై డీఎఫ్‌ఓ జోజి, డిఆర్డిఓ శ్రీనివాసరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్, డి ఎం జగదీష్, డిపిఓ యాదయ్య, పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, సిపిఓ సురేష్, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి, డి ఎం ఆర్టీసీ సురేఖ, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, సంబంధిత తాసిల్దార్లతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జనగణనకు శిక్షణ అనేది చాలా ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో సంబంధిత తహసిల్దారులు ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.