విద్యార్థులకు మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించండి
21-04-2026 03:17 PM
బోథ్: మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను మంగళవారం ఉదయం తాసిల్దార్ సుభాష్ చంద్ర తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించడంతోపాటు రికార్డులను పరిశీలించడం జరిగింది. విద్యార్థులకు మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. ఆడపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న వసతులను వారికి ఉన్న ఇబ్బందులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట డిప్యూటీ తాసిల్దార్ సూరజ్ రావు పాఠశాల ప్రిన్సిపాల్ వలిత ఉన్నారు.






