ఎక్వాయిపల్లిలో ‘సర్ ’ ఓటర్ పరిశీలన కార్యక్రమం ప్రారంభం
కడ్తాల్, జూన్ 25(విజయక్రాంతి): గ్రామంలో ఓటర్ల జాబితా పరిశీలన (సర్ ) కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. స్థానిక సర్పంచ్ పాలకుర్ల కరుణాకర్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియల్లో ఎలాంటి తప్పులకూ తావు లేకుండా, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ, రెవెన్యూ శాఖలు పరస్పరం సమన్వయం (కోఆర్డినేషన్) చేసుకుంటూ ముందుకు సాగాలని, బూత్ లెవెల్ ఏజెంట్ల సహకారంతో ఈ ‘సర్ ’ ప్రక్రియను విజయవంతం చేయాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో జీపీఓ గణేష్, పంచాయతీ కార్యదర్శి నిరంజన్, అంగన్‌వాడీ సిబ్బంది (సుగుణ, లీలావతి, లక్ష్మి), అలాగే స్థానిక నాయకులు చోటే, మహేష్, రవి, ప్రకాష్, మధు, రాజు తదితరులు పాల్గొన్నారు.






