8 March, 2026 | 12:06 AM

భద్రాచలం డిగ్రీ కాలేజీలో స్వచ్ఛభారత్

07-03-2026 08:17 PM

పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు

భద్రాచలం,(విజయక్రాంతి): ప్రభుత్వ మరియు ఉన్నత విద్యాశాఖ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వివిధ విభాగాలకు సంబంధించిన ప్రయోగశాలలను తరగతి గదులను , అధ్యాపకుల గదులను, గ్రంథాలయ గదులను, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు బోధన సిబ్బంది బోధ నేతర సిబ్బంది పరిశుభ్ర పరచటం జరిగినదనీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జాన్ మిల్టన్ అన్నారు.

శనివారం డిగ్రీ కళాశాలలో ఉపయోగపడని వస్తువులను, పరికరాలను తొలగించిన అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జాన్ మిల్టన్ మాట్లాడుతూ... కళాశాలలోని విద్యార్థినీ విద్యార్థులు తమ వ్యక్తిగత శుభ్రతతో పాటు తాము చదివే కళాశాలలో కూడ పరిశుభ్రతను పాటించాలని పరిశుభ్రత యొక్క ప్రాధాన్యతను తెలుపుతూ విద్యార్థులే వాలంటీర్స్ గా కళాశాల పనులలో ముందుండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విభాగ అధిపతులు డాక్టర్ కిరణ్ కుమార్, బి సుధాకర్ రావు , వివిధ విభాగాల అధిపతులైన హవీలా, డాక్టర్ శ్రీను, డాక్టర్ రాగసుమ, ఎన్ హిమజ, డాక్టర్ నాగ సమీరా, వెంకటకృష్ణ, మరియు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.