నేటి నుంచి బడులకు వేసవి సెలవులు
24-04-2026 01:41 AM
జూన్ 12 నుంచి తిరిగి ప్రారంభం
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాం తి): రాష్ట్రంలోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి బడులకు వేసవి సెలవులు ఉండనున్నాయి. గురువారం బడులకు చివరి పని దినం కావడంతో శుక్రవారం నుంచి వేసవి సెలువులు మొదలుకానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వేసవి సెలవులు షురూ అయ్యాయి. విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులుంటా యి. దాదాపు 50 రోజుల పాటు సెలవులు ముగిసిన తర్వాత జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. అదే రోజు నుంచి 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.






