11 June, 2026 | 5:35 PM

ఎమ్మెల్యే విజయ రమణారావును సన్మానించిన సుల్తానాబాద్ రైతులు

11-06-2026 04:26 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి నియోజకవర్గంలో గత రెండు మాసాలుగా సాగిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను రైతులకు ఎలాంటి ఇబ్బందులు, నష్టాలు కలగకుండా అత్యంత విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను గురువారం  ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు  చింతకుంట విజయ రమణారావు ను సుల్తానాబాద్ రైతులు ఘనంగా సన్మానించారు. పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులు, రైతు ప్రతినిధులు ఎమ్మెల్యే కి పూలమాలలు వేసి , శాలువా కప్పి, కృతజ్ఞతలుతెలియజేశారు.

ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎమ్మెల్యే  తన భుజాలపై వేసుకొని రాత్రింబగళ్లు శ్రమించారని కొనియాడారు. క్షేత్రస్థాయిలో ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ లు, హమాలీలు, లారీ ఓనర్లు, రైస్ మిల్లర్లు, ఉన్నతాధికారులతో నిరంతరం సమీక్షలు జరుపుతూ.. ఎక్కడా చిన్న సమస్య కూడా రాకుండా పర్యవేక్షించారని తెలిపారు.ఎమ్మెల్యే  చొరవ వల్ల అటు రైతులకు, ఇటు రైతు అనుబంధ కూలీలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని, పెద్దపల్లి నియోజకవర్గ వరి ధాన్య సేకరణ విధానం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక దిక్సూచిగా నిలిచిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న శాసనసభ్యులకు నియోజకవర్గ రైతాంగం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.ఈ ఘన సన్మాన కార్యక్రమంలో రైతు నాయకులు గేల్లు కొమురయ్య, పల్లె నల్ల ముత్యాలు, జునగరి భూమయ్య, గిర్గుల ప్రభాకర్, మ్యారవేణి లక్ష్మయ్య, జునగిరి చంద్రయ్య ,సహకార సంఘాల అధ్యక్షులు, మార్కెట్ కమిటీల ఛైర్మెన్స్, పెద్ద సంఖ్యలో సుల్తానాబాద్ ప్రాంత రైతులు పాల్గొన్నారు.