11 June, 2026 | 5:36 PM

వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి

11-06-2026 04:24 PM

 జిల్లా పంచాయతీ అధికారి రమేష్..

ఉట్నూర్, జూన్ 11( విజయక్రాంతి): వర్షాకాలంలో  అంటు వ్యాధులు ప్రబలకుండా  గ్రామపంచాయతీలవారు  ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి  రమేష్ సర్పంచులకు,కార్యదర్శులకు సూచనలు చేశారు. గురువారం ఇంద్రవెల్లి మండలంలోని  ధనురా(భి ) పంచాయతీలో పర్యటించారు. గ్రామపంచాయతీ రికార్డులను  పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంటనే మురికి కాలువలు శుభ్రం చేసి  దోమలు నిల్వ ఉండకుండా చూడవలసిన బాధ్యత  పంచాయతీలపై ఉందన్నారు. గ్రామాల్లోని మంచి నీటి ట్యాంకులను  శుభ్రం చేసి  ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లు  అందే విధంగా చర్యలు తీసుకోవాలని  అన్నారు. వర్షాకాలంలో పరిశుభ్రతపై  నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వీధులను శుభ్రం చేయాలని  సూచనలు చేశారు. ఆయనతో పాటు సర్పంచ్ జమున నాయక్, పంచాయతీ కార్యదర్శి  ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.