జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన సుల్తానాబాద్ బార్ అసోసియేషన్
01-04-2026 02:50 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, సీనియర్ సివిల్ జడ్జి భవాని, పోక్సో కోర్టు న్యాయమూర్తి స్వప్న రాణి, జూనియర్ సివిల్ జడ్జి మంజుల, సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ లను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలను బహుకరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వొడ్నాల రవీందర్, ప్రధాన కార్యదర్శి అవునూరి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు ఆవుల శివకృష్ణ, సంయుక్త కార్యదర్శి గుడ్ల వెంకటేష్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పడాల శ్రీరాములు, ఆకారపు సరోత్తం రెడ్డి లు ఉన్నారు.




