calender_icon.png 21 February, 2026 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘గ్లెనెగల్స్’లో విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్లు

21-02-2026 01:39:06 AM

95%కు పైగా సర్వైవల్ రేటును సాధించిన హాస్పిటల్స్ 

హైదరాబాద్, ఫిబ్రవరి 20(విజయక్రాంతి): ఫోర్టిస్ నెట్‌వర్క్‌లో భాగమైన గ్లెనెగల్స్ హాస్పిటల్స్, లక్డీ-కాపుల్  గత 15 ఏళ్లలో 1,500కు పైగా విజయవంతమైన లివర్ ట్రాన్స్‌ప్లాంట్లు నిర్వహించి, 95%కు పైగా సర్వైవల్ రేటును సాధించడం ద్వారా భారతదేశంలోని అగ్రగామి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రాల్లో ఒకటిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. ప్రఖ్యాత లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ విశాల్ కె. చోరాసియా, హెపాటో-ప్యాంక్రియాటో-బిలియరీ (హెచ్‌పీబీ) విభాగాధిపతి నాయకత్వంలోని వివిధ విభాగాల నిపుణుల బృందం ఈ విజయానికి కేంద్రంగా ఉంది.

డాక్టర్ విశాల్ కె. చోరాసియా ఇప్పటివరకు 2,500కు పైగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్లు శస్త్రచికిత్సలు నిర్వహించారు.ఆయనతో పాటు డాక్టర్ డి.మణి కంఠేశ్వర్ రావు, డాక్టర్ తరుణ్ గట్టు (సర్జన్లు), డాక్టర్ కావ్య డెండుకూరి, డాక్టర్. సమీర్ కుమార్ గోడే (హెపటాలజిస్టులు), డాక్టర్ గణేష్ చౌహాన్, డాక్టర్ కార్తిక బాలాజీ (ట్రాన్స్‌ప్లాంట్ ఇంటెన్సివిస్టులు), డాక్టర్ వర్షా సిహెచ్ (అనస్తీషియాలజిస్టు), డాక్టర్ ఉమా కర్రీ (ట్రాన్స్‌ప్లాంట్ రేడియాలజిస్టు) సేవలందిస్తున్నారు.

వయోజన డోనర్లకు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స గేమ్ ఛేంజర్

వయోజన లివింగ్ లివర్ డోనర్ల కోసం ‘ప్యూర్ లాపరోస్కోపిక్ డోనర్ హెపటెక్టమీ’ అనే మినిమల్లి ఇన్వేసివ్ విధానాన్ని ప్రారంభించడం ఆస్పత్రి తాజా మైలురాయిగా నిలిచింది. గ్లెనెగల్స్ హాస్పిటల్స్‌లో వయోజన డోనర్ల ఉదారతకు గౌరవం ఇవ్వడం మా ప్రధాన లక్ష్యం. వారికి అత్యంత సురక్షితంగా, సౌకర్యంగా శస్త్రచికిత్స చేయడం మా లక్ష్యం అని డా. విశాల్ కె. చోరాసియా తెలిపారు. ‘మా బృందం అత్యాధునిక చికిత్సా పద్ధతులు,అధునాతన ఇమేజింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల అవయవ దాతలకు తమ ఇంటికి దగ్గరలోనే అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందుతాయి,’ అని ట్రాన్స్‌ప్లాంట్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ గణేష్ చౌహాన్ తెలిపారు. 

గ్లెనెగల్స్ హాస్పిటల్స్ రీజినల్ సీఈఓ భరత్ కాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక వైద్య రంగంలో కాలేయ మార్పిడి అత్యంత క్లిష్టమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర ప్రాంతాల రోగులకు లక్డీకాపూల్లోని మా గ్లెనెగల్స్ హాస్పిటల్ ఒక నమ్మకమైన చిరునామాగా మారడం గర్వకారణం. పెద్దల కోసం అత్యాధునిక ‘లాప్రోస్కోపిక్’ సర్జరీలతో పాటు, చిన్న పిల్లల కోసం ప్రత్యేకమైన ‘పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్’ ప్రోగ్రామ్‌ను కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఫోర్టిస్ హెల్త్‌కేర్ గ్రూప్ సీఓఓ అనిల్ వినాయక్ మాట్లాడుతూ.‘ఫోర్టిస్ నెట్‌వర్క్‌లో అత్యాధునిక సాంకేతికత, నైపుణ్యం కలిగిన వైద్యులు, పక్కా ప్రణాళికలతో రోగులకు ఎల్లప్పుడూ మెరుగైన ఫలితాలను అందించడమే మా లక్ష్యమని పేర్కొన్నారు.