calender_icon.png 14 February, 2026 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రణాళిక బద్ధంగా చదివి ఉన్నత స్థానాల్లో రాణించాలి

14-02-2026 07:33:03 PM

శ్రీవాణి కళాశాల కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సమయం వృధా చేయకుండా ప్రణాళిక బద్ధంగా  చదివి ఉన్నత స్థానాలకు ఎదిగి మీ లక్ష్యాన్ని సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలి అని కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లిలోని విజయ ఏసి ఫంక్షన్ హాల్ లో శ్రీవాణి జూనియర్ కళాశాల వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రేకులపల్లి శశాంక మాట్లాడుతూ... సమయం సద్వినియోగం చేసుకొని  ప్రణాళిక బద్ధంగా  చదివి ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు లక్ష్యాన్ని ఎంచుకోవాలన్నారు. 

ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ రేకులపల్లి సుష్మ మాట్లాడుతూ ఇష్టపడి ఏకాగ్రతతో చదివి గత సంవత్సరం సాధించిన మార్కుల కన్నా ఎక్కువ మార్కులు సాధించాలన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ బాలసాని శ్రీనివాస్, కళాశాల విద్యార్థులు సాధించిన మార్కులు వారు ఈ విద్యా సంవత్సరం వివిధ క్రీడా పోటీలలో సాధించిన విజయాల ను వార్షిక నివేదిక లో సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డిగ్రీ, పీజీ ప్రిన్సిపల్ బండారి కమలాకర్ మాట్లాడుతూ... క్రమశిక్షణతో ఉండి ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు,  గత సంవత్సరం కళాశాల టాపర్లుగా నిలవడంతో పాటు స్టేట్ ర్యాంక్ లు సాధించిన విద్యార్థులకు వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు రేకులపల్లి శశాంక, డైరెక్టర్ సుష్మ  చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమంలతో ఆహుతులను అలరించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు...