calender_icon.png 12 February, 2026 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలి

11-02-2026 03:21:15 AM

ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్

సికింద్రాబాద్/సనత్‌నగర్, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి): విద్యార్థులు ఏకాగ్రతతో చదివి 10 వ తరగతి లో మెరుగైన ఫలితాలు సాధించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మం గళవారం ఆయన రాంగోపాల్ పేట డివిజన్ ఓల్ గ్యాస్ మండి లో గల ఆదయ్య మెమోరియల్ స్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా టెన్త్ విద్యార్థులను ఏమైనా స మస్యలు ఉన్నాయా? అడిగి తెలుసుకున్నారు. టెన్త్ పరీక్షల సందర్భంగా ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్నాక్స్ పంపిణీ చేశారు.

అనంతరం స్కూల్ లోని సమస్యల గురించి ప్రధానోపాధ్యాయుడు, ఇతర సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. స్కూల్ ఆవరణలో బోర్ రిపేర్ చేయించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కో రారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఏర్పా టు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ కా ర్పొరేటర్‌లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్,ఆకుల హరికృష్ణ, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు బాలాజీ, సిబ్బంది భవాని తదితరులు పాల్గొన్నారు.