7 August, 2026 | 4:55 PM

Breaking News

గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ముందస్తు బోనాల సంబరాలు   •   క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   ఆరేళ్ల నిరీక్షణకు తెర.. మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్   •   అర్బన్ రెసిడెన్షియల్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •  

పూర్తి స్థాయి వినోదం పంచే మిస్టర్ మిడిల్ క్లాస్

15-07-2026 01:12 AM

శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్లుగా, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జీ నాగేశ్వర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిస్టర్ మిడిల్ క్లాస్’. జీకేఅండ్‌సీఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 17న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు వీవీ వినాయక్, దశరథ్, కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరై, ట్రైలర్ లాంచ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. “మిడిల్ క్లాస్ వాళ్లు పడే కష్టాలను వినోదాత్మకంగా చెప్పడం ఒక గొప్ప కళ. ఇలాంటి పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్ చేసి చాలా కాలమైంది.

‘మిస్టర్ మిడిల్ క్లాస్’ కూడా మంచి వినోదాత్మక సినిమానే” అని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామిని చాలా ఫ్రెండ్లీగా చూపించాం. ఆ పాత్ర ద్వారా రాజేంద్ర ప్రసాద్ ప్రేక్షకులందరికీ ఒక స్నేహితుడిలా అనిపిస్తాడు” అని తెలిపారు. ‘మిస్టర్ మిడిల్ క్లాస్ ఘన విజయం సాధిస్తుందని నేను పూర్తి నమ్మకంతో చెబుతున్నాన’ని దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత చందు, నటుడు అలీతోపాటు అతిథులు కూడా మాట్లాడారు. చిత్ర యూనిట్ అందరూ పాల్గొన్నారు.