15 July, 2026 | 1:13 AM

అలంపూర్‌కు విద్యుత్ సామగ్రి మంజూరు చేయాలి

15-07-2026 01:13 AM

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే విజయుడు వినతి

అలంపూర్, జూలై 14: అలంపూర్ నియోజకవర్గంలో విద్యుత్ మౌలిక వసతుల బలోపేతానికి అవసరమైన విద్యుత్ సామగ్రిని మంజూరు చేయాలని అలంపూర్ ఎమ్మెల్యే  విజయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కోరారు.మంగళవారం గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పర్యటించిన  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీ మల్లు రవిని  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికిన అనంతరం వినతిపత్రాన్ని అందజేశారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విద్యుత్ మౌలిక వసతులు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే వివరించారు. రైతులకు, గ్రామీణ ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ స్తంభాలు, కండక్టర్లు, ఏబీ కేబుల్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్లు) తదితర సామగ్రిని తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు అవసరమైన విద్యుత్ సామగ్రి వివరాలతో కూడిన జాబితాను కూడా ఉప ముఖ్యమంత్రికి సమర్పించారు. అనంతరం వడ్డేపల్లి మండలం జూలకల్ గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రఘురెడ్డి తదితరులు పాల్గొన్నారు.