calender_icon.png 23 February, 2026 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాధ వృద్ధాశ్రమానికి విద్యార్థులు నగదు విరాళం

23-02-2026 06:35:51 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి గ్లోబల్ మీడియా ఇంగ్లీష్ మీడియం స్కూల్  విద్యార్థులు సేవా కార్య క్రమంలో భాగంగా శ్రీ సాయి అనాధ వృద్ధాశ్రయ వెల్ఫేర్ సొసైటీకి రూ.5,376 నగదు విరాళం సహాయం అందజేశారు. సోమవారం సేవా కార్యక్రమంలో విశేషంగా సహకరించిన విద్యార్థులు సంకీర్తనకు గోల్డ్ మెడల్, మణికంఠకు సిల్వర్ మెడల్‌ల ను సంస్థ ప్రతినిధి ఏం. ప్రభుదాస్ ప్రోత్సాహకంగా అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎండి తఫీమ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సేవా భావం పెంపొందించడం విద్యాసంస్థల ప్రధాన బాధ్యత అని  అన్నారు. విద్యార్థుల సేవా దృక్పథాన్ని చూసి స్థానికులు అభినందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రామచందర్, ఉపాధ్యాయు లు జైనబ్ ఫాతిమా, కవిత, గీత మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.