ఎన్‌ఆర్‌ఎస్ కాలేజిలో విద్యార్థిని ఆత్మహత్య
18-04-2026 01:50 AM
సూర్యాపేట జిల్లా కోదాడలో ఘటన
కోదాడ, ఏప్రిల్ 17(విజయక్రాంతి):సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎన్‌ఆర్‌ఎస్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని బొగ్గరపు లెక్ష (16) శుక్రవారం ఆత్మహత్యకు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని మేళ్లచెరువు గ్రామానికి చెందిన లెక్ష ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో తప్పింది.
దీంతో సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలనే ఉద్దేశంతో శుక్రవారం కళాశాలకు వచ్చిన విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుందన్నారు. గమనించిన సహ విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించగా కన్నుమూసిందన్నారు.






