29 April, 2026 | 4:15 PM

Breaking News

ప్రజాపాలన ప్రగతి ప్రాణాళిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం   •   బీఆర్ఎస్ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక   •   ప్రతి కాలనీని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం   •   ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజాదర్బార్   •   ప్రభుత్వ హాస్పటల్లో భరోసా కేంద్రం అవగాహన సదస్సు   •   సమగ్ర శిక్ష ఉద్యోగులీలు చేపట్టండి: పాడ్య నాగేశ్వర రావు   •   బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ ను విజయవంతం చేయాలి - రేగా   •   తాడూరు అంగన్వాడిలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం   •   కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ   •   పంటను కాపాడుకునే ప్రయత్నంలో రైతు వేసిన వలలకు చిక్కి అరుదైన పక్షుల మృతి   •  

ఓయూలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

28-04-2026 12:00 AM

సికింద్రాబాద్, ఏప్రిల్ ౨౭ (విజయక్రాంతి): ఓ విద్యార్థి పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన వినీష్ (19) ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో మైనింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.

సోమవారం ఉద యం సుమారు 9 గంటల సమయంలో లేడీ స్ హాస్టల్   ముందు వినీష్ తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, తీవ్ర గాయాలతో ఉన్న వినీష్ను ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటన కు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.