వాచ్‌మెన్‌ను కాపాడిన మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, పాలకవర్గం
మల్లాపూర్,(విజయక్రాంతి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మల్లాపూర్ మోడల్ స్కూల్‌లో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ వరద ప్రవాహంలో చిక్కుకుని భయాందోళనకు గురైన ఘటన గురువారం చోటుచేసుకుంది.మోడల్ స్కూల్ నుంచి మల్లాపూర్ గ్రామానికి వస్తున్న సమయంలో రోడ్డుపై భారీగా వరద నీరు ప్రవహించడంతో ఆయన రోడ్డు దాటలేక అక్కడే నిలిచిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న మల్లాపూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ వెంటనే పాలకవర్గ సభ్యులతో కలిసి కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సంఘటన స్థలానికి చేరుకున్నారు.అనంతరం అప్రమత్తంగా సత్యనారాయణను వరద ప్రవాహం నుంచి సురక్షితంగా రోడ్డు దాటించి, సర్పంచ్ తన కారులో గ్రామానికి తరలించి క్షేమంగా ఇంటికి చేర్చారు. ఈ మానవతా చర్యపై గ్రామస్థులు సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్‌తో పాటు గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని అభినందించారు.






