కరీంనగర్ కళాకారుల బోనాల జాతర పోస్టర్ ఆవిష్కరణ
30-07-2026 05:00 PM
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ కళాకారుల ఆధ్వర్యంలో ఆగస్టు 5న నిర్వహించనున్న కరీంనగర్ కళాకారుల బోనాల జాతర పోస్టర్ ను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... ఆగస్టు 5న ఉదయం 9 గంటలకు గీతాభవన్, తెలంగాణ చౌక్ నుంచి బోనాల ర్యాలీ ప్రారంభమై కోతిరంపూర్ పోచమ్మ ఆలయం వరకు కొనసాగుతుందని, అక్కడ అమ్మవారికి బోనాలను సమర్పించనున్నట్లు తెలిపారు.అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కరీంనగర్ కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని బోనాల జాతరను విజయవంతం చేయాలని మేయర్ పిలుపునిచ్చారు.






