30 July, 2026 | 6:11 PM

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

30-07-2026 04:56 PM

ఎస్సై సిరిసిల్ల అశోక్

ఇల్లంతకుంట,(విజయక్రాంతి): వర్షాల నేపథ్యంలో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ అన్నాడు. భారీ వర్షాలు పడటం  వల్ల  ప్రవహిస్తున్న వాగులు, వంకలు, చెరువులు, కాలువలు వద్దకు వెళ్ళకుండా  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలు, యువత వెళ్లకూడదు అని, వర్షం నీటి వల్ల రోడ్డుపై వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని సూచించాడు.

పిల్లలు, యువకులు చెరువులు, కాలువల దగ్గరకు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈత కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలని, అలాగే విద్యుత్ పరికరాలను పోల్స్ కు దూరంగా ఉండాలి. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలంచడానికి  పోలీసు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఎటువంటి సహాయం కావాలన్నా Dail 100/112 కి లేదా స్థానిక గ్రామ పోలీస్ అధికారులకి ఫోన్ చేయాలి అని ఎస్సై తెలిపాడు.