సమ్మె హారన్
ఆర్టీసీ, కార్మిక శాఖ అధికారులకు నోటీసులు ఇచ్చిన జేఏసీ
- ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి
- ట్రేడ్ యూనియన్లకు ఎన్నికలు నిర్వహించాలి
- ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలుచేసి ఇవ్వాలి
- ఆర్టీసీ జేఏసీ నేతల డిమాండ్
హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యా నికి, కార్మిక శాఖ అధికారులకు జేఏసీ నేత లు శుక్రవారం సమ్మె నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలుచేయాలని, కండక్టర్, డ్రైవర్ల ఉద్యోగ భద్రత, ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వమే ఆర్టీసీకి కొనుగోలుచేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తొలుత ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ వెంకన్నకు జేఏసీ నేతలు బస్ భవన్‌లో కలిసి నోటీసు ఇచ్చారు.
అనంతరం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని కార్మికశాఖ కమిషనర్ కార్యాల యంలో జాయింట్ కమిషనర్ సునీతా మోహన్‌కు జేఏసీ నేతలు నోటీసులు అందజేశారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కార్మికుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఎన్ని విజ్ఞప్తులు చేసినా స్పందించకపోవడంతో సమ్మె నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు.
మహాలక్ష్మి పథకం కింద ప్రతినెల రూ. 350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలని, పాత బకాయిలు రూ. 2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె నోటీ సు ఇచ్చిన తేదీ నుంచి 14 రోజుల్లోపు ఆర్టీ సీ యాజమాన్యంతో కార్మికశాఖ అధికారు లు త్వరితగతిన చర్చలు జరిపి తమ డిమాండ్లను పరిష్కరించేందుకు కృషిచేయాలని, ఒకవేళ ఆ సమావేశంలో పరిష్కా రం కాకుంటే ఆతర్వాత తాము సమ్మెకు పోతామని పేర్కొన్నారు.
తాము ఇచ్చిన సమ్మె నోటీసుకు 40 రోజుల వ్యాలిడిటీ ఉంటుందని, ఈలోపు కార్మికశాఖ మధ్యవర్తిత్వం చేయకుంటే మరోసారి నోటీసులి వ్వాల్సి వస్తుందని, అందుకే కార్మిక శాఖ తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని రేవం త్‌రెడ్డి హామీ ఇచ్చారని,
ఆయన సీఎం అయి రెండున్నర సంవత్సరాలు గడిచినా విలీన ప్రక్రియ ఇంకా మొదలుపెట్టలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ నేటివరకు అమలుకా కపోవడంతో కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2017కు సంబం ధించిన వేతన సవరణ ఇచ్చారని, కానీ ఏరియర్స్ ఇంతవరకూ చెల్లించలేదన్నారు.
అలా గే అలవెన్సులు, బెనిఫిట్స్ పెంచకపోవడం చాలా దారుణమన్నారు. పాత అలవెన్సులే ఇవ్వటంతో కార్మికులకు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. 2017లో రిటైరైన కార్మి కులకు ఇంతవరకు సెటిల్‌మెంట్స్ చేయలేదని పేర్కొన్నారు. కన్వీనర్ ఎండీ మౌలానా మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఆర్టీసీ ఉద్యోగి చనిపోతే సింగరేణి, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఆర్టీసీలో కూడా బ్రెడ్ విన్నర్ స్కీమ్ కింద నియామకాలు రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశారు. కో కన్వీనర్ కే యాదయ్య మాట్లాడుతూ, ఆర్టీసీ లో ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించి ఎ న్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.




