గది ఒకటి.. తరగతులు నాలుగు
28-06-2026 01:05 AM
సాధారణంగా ఒక గదిలో ఒక తరగతి మాత్రమే నిర్వహిస్తారు.. హైదరాబాద్ సుల్తాన్‌బజార్‌లోని బడిచౌడి ప్రభుత్వ పాఠశాలలో అలా సాగడంలేదు. ఇక్కడ మరాఠి, ఇంగ్లిష్ మీడియం రెండూ ఉన్నాయి. తరగతి గదులు చాలా తక్కువగా ఉండటంతో ఒక రూంలో నాలుగు తరగతులకు పాఠాలు చెప్తున్నారు. మధ్యలో బీరువాలు అడ్డుపెట్టి అటు రెండు, ఇటు రెండు తరగతులు నిర్వహిస్తున్నారు.






