టెన్త్‌లో శ్రీ చైతన్య రికార్డు ఫలితాలు
అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు
హైదరాబాద్, ఏప్రిల్ 29(విజయక్రాంతి): బుధవారం విడుదలైన ఎస్‌ఎస్‌సీ పరీక్షా ఫలితాల్లో శ్రీ చైతన్య స్కూల్ అద్భుతమైన 597 మార్కులతో అగ్రస్థానం నిలిచిందని శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ తెలిపారు. అలాగే క్రింది విభాగాల్లో అత్యుతమ మార్కులు సాధించిన మార్కులు శ్రీ చైతన్య విద్యార్థుల సంఖ్యను కూడా ఆమె ప్రకటించారు.
580, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు 829 మంది, 570.. అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు 2,303 మంది, 560 .. అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు 3,954 మంది, 550.. అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు 5,521 మంది. శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు సాధించిన సబ్జెక్టుల వారీ ఏ గ్రేడ్‌ల సంఖ్య ఈ విధంగా ఉంది.
ఫస్ట్ లాంగ్వేజ్ ఏ గ్రేడ్లు : 11,302, సెకండ్ లాంగ్వేజ్ ఏ గ్రేడ్లు : 12,380, ఇంగ్లిష్ ఏ గ్రేడ్లు : 13,821, గణితంలో ఏ గ్రేడ్లు : 12,226, సైన్స్‌లో ఏ గ్రేడ్లు : 13,273, సోషల్‌లో ఏ గ్రేడ్లు : 14,737 మొత్తం ఏ గ్రేడ్లు : 77,739 గరిష్టంగా 600 మార్కుల్లో, శ్రీ చైతన్య స్కూల్ సుమారు సగటు మార్కులు 532 సాధించిందని, మొత్తం ఉత్తీర్ణత శాతం 99.7% గా నమోదైందని ఆమె తెలిపారు. శ్రీ చైతన్య స్కూల్‌కి చెందిన 132 బ్రంచిల్లో 100% ఉత్తీర్ణతను సాధించాయని పేర్కొన్నారు.
అలాగే సబ్జెక్ట్‌ల వారీగా 100/100 మార్కులు సాధించిన వారి సంఖ్య మాథ్స్ 1,647, సోషల్ 357, ఫస్ట్ లాంగ్వెజ్ 259, సెక్‌ండ్ లాంగ్వెజ్ 105, వివిధ సబ్జెక్ట్‌ల్లో 2,441 మంది 100/100 మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు.శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ మాట్లాడుతూ, శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచిలు ఉన్న మెజారిటీ జిల్లాల్లో, మండలాల్లో, పట్టణాలు/నగరాల్లో శ్రీ చైతన్య స్కూల్ టాప్ మార్కులు సాధించిన అగ్రస్థానంలో నిలిచిందన్నారు.
ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా, ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు 100 లోపు 12ర్యాంకులు, 1000లోపు 77 ర్యాంకులు సాధించారన్నారు. అలాగే ఇటీవల విడుదలైన్ సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు 499/500 మార్కులు సాధించారని, మెజారిటీ రాష్ట్రాల్లో టాప్ మార్కులతో పాటు, ఓవరాల్ గా 100% పాస్ సాధించామని ఆమె తెలిపారు. డైరెక్టర్ సీమ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఇంతట భారీ విజయానికి మరే ఇతర విద్యాసంస్థ కూడా సమీపంలో లేదన్నారు. ఈ గొప్ప విజయానికి కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధనా సిబ్బందిని అభినందించారు.






