30 April, 2026 | 3:23 AM

కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసిన వ్యక్తిపై కేసు

30-04-2026 01:45 AM

చందుర్తి, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ గ్ర మపంచాయతీ కార్యదర్శి  సంతకంను తన వ్యక్తిగత అవసరాల కొరకై  ఫోర్జరీ చేసి, మో సం చేసిన  వ్యక్తిపై కేసు నమోదు చేసారు.

పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం నర్సింగపూర్ గ్రామానికి చెందిన  నాగుల తిరుపతి అను వ్యక్తి తన ఇంటి పై బ్యాంక్ లోన్ పొందుటకు గాను అవసరమైన ఇంటి ధ్రువీకరణ పత్రంపై నర్సింగాపూర్ పంచాయతీ కార్యదర్శి కళాజ్యోతి  యొక్క సంతకంని ఫోర్జరీ చేసి తనతో పాటు హౌసింగ్ లోన్ ఇచ్చేవారిని ఉద్దేశపూర్వకంగా మోసం చేసినాడని మరియు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, గ్రామ పంచాయతీ యొక్క స్టాంపులను తన అవసరాల కోసం తయారు చేయించిన నాగుల తిరుపతి అలాగే అతనికి సహకరించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి యొక్క దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసినట్లు చందుర్తి ఎస్. ఐ. జె రమేష్ గారు తెలిపారు.