చిలుకూరులో ఆధ్యాత్మిక సంగీత యజ్ఞం
హైదరాబాద్, జూన్ 14(విజయ క్రాంతి): సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు, రైతాం గం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చారిత్రాత్మక చిలుకూరు బాలాజీ దేవాలయంలో జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా వేణునాదం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. జ్యేష్ఠ అమావాస్య, రోహిణి నక్షత్రం కలిసిన పుణ్యదినాన నిర్వహించిన ఈ ప్రత్యే క కార్యక్రమంలో వేణు విద్వాంసుడు అనం త కృష్ణ మధురమైన వేణుగానంతో భక్తుల ను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తారు.
ఆ యనకు వెంకట నాగ సాయి శర్మ మృదంగంపై, పవన్ సింగ్ వయోల్పి సహకరించా రు. రైతాంగానికి అనుకూలంగా వర్షాలు కు రవాలని, భూగర్భ జలాలు పునరుద్ధరించబడాలని, ప్రకృతి సమతుల్యత నెలకొనాలని ఆలయ వేదికగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎలాంటి వాణిజ్య ఉద్దేశాలు లేకుండా పూర్తిగా నిష్కామ భక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. సనాతన ధర్మంలో సంగీతాన్ని దైవారాధనకు శ్రేష్ఠ సాధనంగా భావిస్తారని, అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వేణునాదం ద్వారా ప్రకృతి శ్రేయస్సు కోసం సామూహిక ప్రార్థనలు చేపట్టినట్లు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమంలో చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ తదితరులు పాల్గొన్నారు.






