15 June, 2026 | 3:18 AM

25 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత

15-06-2026 12:51 AM

మహబూబాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): గుడుంబా తయారీకి వినియోగించే నిషేధిత నల్లబెల్లం అక్రమంగా తరలిస్తుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఘటన వివరాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ కే.  నాగయ్య వెల్లడించారు. పెద్ద వంగర మండలంలోని చిన్న వంగర గ్రామ శివారులో  విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.

చిన్న వంగర గ్రామ శివారులో ట్రాలీ వాహనం  అనుమానస్పదంగా కనిపించగా ఆపి తనిఖీ చేయగా 50 సంచుల్లో 25  క్వింటాళ్ల నల్ల బెల్లం, 4 సంచుల్లో 200 కిలోల పటిక, 20 లీటర్ల నాటు సారా లభ్యమైంది. రవాణాకు వినియోగించిన ట్రాలీ  సీజ్ చేసి, రవాణా చేస్తున్న మరిపెడ మండలం దాస్య తండకు చెందిన ట్రాలీ డ్రైవర్ గుగులోతు ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ రవాణాకు సంబంధం ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్త్స్ర ఎన్ రజిత, సిబ్బంది శ్రీనివాస్ కుమార్, శరత్, బాబు తదితరులు పాల్గొన్నారు.