24 May, 2026 | 12:40 AM

పుష్కర ఘాట్లలో ఆధ్యాత్మిక ఉత్సాహం

24-05-2026 12:00 AM

భక్తులతో కళకళలాడుతున్న కాళేశ్వరం

త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు 

వైభవంగా సాగుతున్న సరస్వతీ అంత్య పుష్కరాలు

కాళేశ్వరం/మహబూబాబాద్, మే 23 (విజయక్రాంతి): సరస్వతీ అంత్య పుష్కరాల సందర్భంగా మూడో రోజైన శనివారం భూ పాలపల్లి జిల్లా కాళేశ్వరానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు తరలి వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించున్నారు. ఆర్టీసీ బస్సు ల్లో వచ్చే భక్తుల సౌకర్యార్థం బస్టాండ్ నుంచి పుష్కర ఘాట్ వరకు ఉచిత షటిల్ సర్వీసులు ఏర్పాటు చేశారు.

త్రివేణి సంగమం లో పుణ్యస్నానాలు ఆచరించిన అనంత రం భక్తులు కాళేశ్వరం ప్రధాన ఆలయాన్ని సందర్శించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శుభానంద దేవి, సరస్వతి మాతలను దర్శించుకుంటున్నారు. ప్రతిరోజూ నిర్వహిస్తున్న స్వామివారి కల్యాణం, ప్రత్యేక హోమాలలో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నా రు. సరస్వతి ఘాట్ వద్ద సాయంత్రం నిర్వహించే సరస్వతి నవరత్న మాలా హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

హారతి అనంతరం సాంస్కృతిక కళా ప్రదర్శనలు, పండి తుల ప్రవచనాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ ప్రాంతాల నుండి స్వామీ జీలు విచ్చేసి ప్రవచనాలు అం దించడంతో భక్తుల రాక మరింతగా పెరుగుతోంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మంచినీటి సరఫరా, చలువ పందిళ్లు, మిస్ట్ ఫాగ్ స్ప్రిం క్లర్లు ద్వారా నీటి జల్లులు పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ద్వారా భక్తులు సేదతీరుతున్నా రు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగ కుండా అన్ని శాఖల సమన్వయం తో యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసి పుష్కరాలను విజయవంతంగా నిర్వహిస్తోంది.

స్వామిజీల పూజలు

అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని నాసి క్‌కు చెందిన మహా మండలేశ్వర ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉద యం సరస్వతి నదిలో పుణ్యస్నానం ఆచరించిన అనంతరం ఆలయానికి చేరుకున్న మహారాజ్‌కు అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.

అలాగే పార్వ తి (శుభానంద)దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. పూజల అనంతరం ఆశీర్వచన మండపంలో అర్చకులు, భక్తులకు ధార్మిక సందేశం అందిస్తూ ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయం తరఫున స్వామివారి శేష వస్త్రాలను మహారాజ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోహన్ శర్మ, ఆర్జేసీ రామకృష్ణ, ఈవో మహేష్, ఆలయ అధికారులు, వేద పండితులు, భక్తు లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా పుష్కర ఘాట్ల వద్దకు భారీగా తరలివస్తున్న భక్తులు గుర్తించిన ఘాట్ల వద్దనే స్నానాలు ఆచరించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ కోరారు. గుర్తించని ఇతర ప్రాంతాల్లో స్నానాలు చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. నదిలో ప్రవాహం, లోతు వంటి అంశాలు పరిగణనలోకి తీసుకుని అధికారులు భద్ర తా చర్యలు చేపట్టిన పుష్కర ఘాట్లను మాత్రమే వినియోగించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. 

మిషన్ భగీరథ ఆధ్వర్యంలో సేవలు 

సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిషన్ భగీరథ విభాగం విస్తృత స్థాయిలో తాగునీరు మరియు పారిశుధ్య సదుపాయాలను ఏర్పాటు చేసింది. పుష్కర ఘాట్ల వద్దకు భారీగా తరలివస్తున్న భక్తులకు స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రమైన వాతావరణం అందించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఎండ తీవ్రత నేపథ్యంలో భక్తులకు తాగునీరు అందించేందుకు 38 తాగునీటి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎప్పటికప్పుడు తాగునీరు అందుబాటులో ఉండేలా 5 నీటి ట్యాంకర్లు ద్వారా సేవలు అందిస్తున్నారు. సరఫరా చేస్తున్న నీటి నాణ్యతను కాపాడేందుకు నీటి క్లోరినేషన్ ప్రక్రియను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి విభాగంలోని సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు.

చీఫ్ ఇంజినీర్ కే. సురేష్ పర్యవేక్షణలో ఎస్ ఈ చలమల రెడ్డి, ఈఈలు (ఇంట్రా) స్వేత, (గ్రిడ్) మాణిక్యరావు, డీఈఈలు పి. రమేష్, కిరణ్, సంధ్యారాణి, 15 మంది ఏఈలు, ఏఈఈలు, ఆరుగురు ల్యాబ్ సిబ్బంది, 30 మంది హెల్పర్లు, అలాగే ఏజెన్సీ ద్వారా 120 మంది నీటి సరఫరా నిర్వహణ సిబ్బంది సేవలందిస్తున్నారు.