24 May, 2026 | 1:26 AM

కోర్ అర్బన్‌లో విద్యాభివృద్ధి కార్యక్రమాలు

24-05-2026 12:37 AM
  1. రహేజా గ్రూప్, యశోద గ్రూప్, రామ్‌కీ ఫౌండేషన్ ఆర్థికంగా సహాయం  
  2. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు
  3. ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రభు త్వ విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి రహేజా గ్రూప్, యశోద గ్రూప్, రామ్‌కీ ఫౌండేషన్ ముందుకొచ్చాయి. ఈ మేరకు శ నివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స మక్షంలో విద్యాశాఖతో అధికారిక ఒప్పందాలు చేసుకున్నాయి. ఒప్పంద పత్రాలను పరస్పరం అందజేసుకున్నారు.

ఆయా సంస్థ లు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులను వెచ్చించనున్నాయి. ఆర్థిక సహాయం అందజేయటానికి ముందుకొచ్చిన సంస్థల ప్రతిని ధులను ముఖ్యమంత్రి అభినందించారు.

ఈ కార్యక్రమంలో రహేజా గ్రూప్ అధ్యక్షుడు నీల్ సి.రహేజా, రామ్‌కీ ఫౌండేషన్ మేనేజిం గ్ ట్రస్టీ అల్లా దాక్షాయణి, యశోద గ్రూప్ డైరెక్టర్ గోరుకుంటి దేవేందర్‌రావు, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) చైర్మన్ సి.శేఖర్‌రెడ్డి,  విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజి త్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఒప్పందాలు ఇలా..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్‌గనర్‌లో ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వ రకు తరగతి గదుల నిర్మాణానికి రాంకీ సం స్థ ఆర్థిక సహాయం అందజేయనుంది. మొ త్తం ఖర్చులో 40 శాతం మేర (రూ.19.66 కోట్లు) వెచ్చించనుంది. 

* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నతీకరణలో భాగంగా ప్రీప్రైమరీ నుంచి 5వ తరగతి, ఇంటర్ తరగతి గదుల నిర్మాణానికి రాంకీ సంస్థ సహాయం అందజేయ నుంది. మొత్తం వ్యయంలో 40 శాతం (రూ.10.4 కోట్లు) ఖర్చు చేయనుంది.

* రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతి గదుల నిర్మాణానికి అవసరమైన రూ.50.50 కోట్లు రహేజా గ్రూప్ ఆర్థిక సహాయం అందజేయనుంది.

* మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ సు భాషనగర్ ఎంపీపీఎస్‌లో ప్రీ-ప్రైమరీ, 6వ, 7వ తరగతి గదుల నిర్మాణం కోసం రూ. 12.20 కోట్లు యశోద హాస్పటల్స్ గ్రూప్ ఖర్చు చేయనుంది.