బీఆర్‌ఎస్ నాయకుడి దారుణ హత్య
- వేట కొడవళ్లతో విచక్షణ రహితంగా దాడి
- సూర్యాపేట జిల్లా యర్కారంలో ఘటన
సూర్యాపేట, మే 23 (విజయక్రాం తి): సూర్యాపేట జిల్లాలో ఓ బీఆర్‌ఎస్ నాయకుడు దారుణ హత్యకు గురవడం సంచలనం రేకెత్తింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం రాత్రి సూర్యాపేట మండలం యార్కారం గ్రామానికి చెందిన చింతలపాటి మధు(43) అతని స్నేహితులతో కలిసి బయటకు వెళ్లగా అదే అదునుగా తీసుకుని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేసినట్లు తెలిపారు.
వీరు వేట కొడవళ్లతో విచక్షణారహితంగా నరకడంతో శరీరం ముక్కలై మృ తి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం ముక్కలైన భాగాలను గోనె సంచుల్లో మూటకట్టి గ్రామ సమీపంలోనిఎస్సారెస్పీ కాలువలో పడేశారన్నారు. శనివారం ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచా రం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు.
హత్యకు గల కారణాలపై పో లీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. చింతలపాటి మధు భార్య మౌనిక గతంలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు.ఈ హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానితుల కోసంగాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు అనుమానితులను పోలీస్ లు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.






