24 May, 2026 | 1:04 AM

నేను బెస్ట్ పీసీసీ చీఫ్

24-05-2026 12:16 AM
  1. పీసీసీ మార్పుపై అధిష్ఠానానిదే తుదినిర్ణయం
  2. నేను, సీఎం కలిసి పనిచేయడం కొందరికి నచ్చడం లేదు
  3. హైదరాబాద్ అభివృద్ధి హరీశ్‌కు అవసరంలేదా?
  4. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): ఏఐసీసీ దృష్టిలో తాను బెస్ట్ పీసీసీ చీఫ్‌నని, పీసీసీ మార్పు విషయంలో అధిష్ఠానానిదే తుది నిర్ణయమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. ‘నేను, సీఎం కలిసి పని చేయడం కొందరికి మింగుడుపడడం లేదు. నేను సరైన వ్యక్తిని అనే నాకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారు’ అని తెలిపారు.  సరైన సమయంలో అందరికీ సమా ధానం తెలుస్తుందని, తనపై వస్తున్న ఆరోపణలు, వచ్చిన కథనాలను తాను పట్టించుకో నన్నారు.

తనపై వచ్చిన ఆరోపణలపై పీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ శనివారం మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ ముఖ్యనేత కేసీ వేణుగోపాల్ తనను అనేకసార్లు అభినందించారని, చిన్నా చితక విష యాలపై తన సమయాన్ని వెచ్చించనన్నారు. అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ మీడియాకి ఉందన్నారు. గాంధీ భవన్ ట్రస్ట్ వాళ్ల దని, తనపై ఒక ఛానెల్ ప్రచారం చేస్తే అది ప్రామాణికం కాదని, తన పనితీరుని బేరీజు వేయాల్సింది తమ ముఖ్యమంత్రి అని, తమ కార్యకర్తలని స్పష్టం చేశారు.

తాను పత్రికా స్వేచ్ఛను అర్థం చేసుకున్న వ్యక్తినని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఫ్యూచర్ సిటీ దేశానికే దిక్సూచిగా మారుతుందని, బీఆర్‌ఎస్‌కు దూరదృష్టి లేదని ఆయన విమర్శిం చారు. హైదరాబాద్ పరిధిని పెంచలేదని, సీటీని విస్తరిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అవసరం లేదని హరీశ్‌రావు అంటున్నారా? అని ప్ర శ్నించారు. తెలంగాణపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు.

తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ లాగే తామూ గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తున్నా మన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ల పేర్లను ఏఐసీసీకి పంపించామని, త్వరలోనే ప్రకటిస్తామ న్నారు. క్యాబినెట్ విస్తరణ సీఎం చూసుకుంటారని, విస్తరణలో తన ప్రమేయం లేద న్నారు. ఓటర్ల జాబితా ఎస్‌ఐఆర్ పేరుతో అక్రమంగా ఓట్లను తొలగించాలని చూస్తే అడ్డుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరగడంతో కొనుగోళ్లలో కొంత జాప్యం ఏర్పడిందని పేర్కొన్నారు.