కాంగ్రెస్‌వి హత్యా రాజకీయాలు
- మధు చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
- మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
సూర్యాపేట, మే 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదని మాజీ మంత్రి, సూర్యా పేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలం యార్కారం గ్రామంలో హ త్యకు గురైన బీఆర్‌ఎస్ నాయకుడు చింతలపాటి మధు భౌతికకాయానికి శనివారం ని వాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. మధుది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యేనన్నా రు.
పోలీస్‌ల వ్యవహార శైలి చూస్తుంటే ఈ హత్యలో వారి భాగస్వామ్యం ఉందనే అనుమానం కలుగుతుందన్నారు. బీఆర్‌ఎస్ ప దేండ్ల పాలనలో ప్రశాంత వాతావరణాన్ని పెంపొందించానన్నారు. కానీ కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత విభేదాల వల్ల వందలాది హత్యలు జరుగుతున్నాయన్నారు. బీఆర్‌ఎ స్ పార్టీ నాయకులను స్టేషన్లకు పిలిపించి మరీ కాంగ్రెస్ గుండా ల ముందు నిలబెట్టి అవమాన పరుస్తున్నారన్నారు. గతంలోనూ ఇదే కాంగ్రెస్ గుండా లు మా పార్టీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నను సైతం దారుణంగా హత్య చేసిండ్రన్నారు.
మధు హత్యకు కాంగ్రెస్ నాయకులు, పోలీ సు అధికారులదే బాద్యత అన్నారు. నిజమైన నిందితులెవరో గుర్తించి సరైన శిక్ష పడే విధంగా పోలీసు అధికారులు పనిచేయాలన్నారు. మధు కుటుంబానికి అండగా నిలబ డతామన్నారు. ఇద్దరు ఆడపిల్లల చదువుల బాధ్యత, కుటుంబ పోషణ విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందన్నారు. జగదీష్ వెంట బీఆర్ ఎస్ నాయకులు బడుగుల లింగయ్య యాదవ్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, నెమ్మాది భిక్షం తదితరులు ఉన్నారు.






