వైద్య రంగంలో విశేష ప్రతిభ
శ్రీధర్ పెద్దిరెడ్డికి ‘విజనరీ లీడర్షిప్ ఇన్ హెల్త్‌కేర్ ఎక్స్‌లెన్స్’ అవార్డు
వైద్య రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ, విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రెనో వా హాస్పిటల్స్ ఫౌండర్, సీఈఓ శ్రీధర్ పెద్దిరెడ్డికి మరో అరుదైన గౌరవం దక్కింది. హైద రాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో నిర్వహించిన జీ తెలుగు న్యూస్ హెల్త్‌కేర్ ఎక్స్‌లెన్స్ అవార్‌ేొ్డ్స2026 వేడుకలో ఆయనకు ప్రతిష్టాత్మక ‘విజనరీ లీడర్షిప్ ఇన్ హెల్త్‌కేర్ ఎక్స్‌లెన్స్’ అవార్డును తెలం గాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అందజేశారు.
క్యాన్సర్ చికిత్సలో నూతన అధ్యాయం
శ్రీధర్ పెద్దిరెడ్డి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ‘రెనోవా హాస్పిటల్స్’ వైద్య రం గంలో శరవేగంగా దూసుకుపోతోంది. ప్రస్తు తం ఈ నెట్‌వర్క్ 12 అధునాతన యూనిట్లు, 2,000 పడకల సామర్థ్యంతో విస్తరించి, రోగులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన మల్టీ స్పెషాలిటీ సేవలను అందిస్తోంది.
వైద్య రంగంలో సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకోవడంలో రెనోవా ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. శ్రీధర్ పెద్దిరెడ్డి నేతృత్వంలో క్యాన్సర్ బాధితులకు అత్యంత ఖచ్చితమైన, రోగి-కేంద్రిత చికిత్సను అందించడానికి ప్రపంచ స్థాయి సాంకేతికతలను ప్రవేశపెట్టారు. వీటి ద్వారా ప్రిసిషన్ అంకాలజీ, అడ్వానస్డ్ డయాగ్నోస్టిక్స్, కార్డియాక్ సైన్సెస్, న్యూరో సైన్సెస్, ఆర్థోపెడిక్స్, నెఫ్రాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్ (ఉమెన్ అండ్ చైల్డ్ కేర్) వంటి విభాగాలలో అంతర్జాతీయ స్థాయి సేవలను అందుబాటులోకి తెచ్చారు.
సేవా పథంలో ‘శ్రీ ధరణి ఫౌండేషన్’
వైద్య సేవలతోనే ఆగకుండా, సామాజిక బాధ్యతలోనూ రెనోవా గ్రూప్ ముందుంది. శ్రీధర్ పెద్దిరెడ్డి స్థాపించిన శ్రీ ధరణి ఫౌండేషన్ ద్వారా గ్రామీణ విద్యాభివృద్ధి, పర్యావర ణ పరిరక్షణ, గ్రామీణ సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ సమాజ సేవలో తనదైన ముద్ర వేస్తున్నారు. శ్రీధర్ పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ పురస్కారం మా బాధ్యతను మరింత పెంచింది.
గవర్నర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. మేము కేవలం ఆసుపత్రులను నిర్మించడం లేదు. సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆశాజనకమైన, నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండే ఒక సరికొత్త ఆరోగ్య వ్యవస్థను సృష్టిస్తున్నాము. సాంకేతికత, మానవీయ విలువలు, తక్కువ ఖర్చుతో కూడిన వైద్యమే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు.






