14 March, 2026 | 3:19 AM

పాక్ లీగ్ నుంచి వైదొలిగిన స్పిన్నర్

14-03-2026 12:00 AM

ట్రినిడాడ్, మార్చి 13: వెస్టిండీస్ స్టార్ స్పిన్నర్ గుడకేశ్ మోతీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 నుంచి వైదొలిగాడు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత మోతీ విండీస్ జట్టుతోపాటు పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా వారం రోజులపాటు భారత్‌లో చిక్కుకుపోయాడు.

ఇప్పుడు మరోసారి ఆసియాకు ప్రయాణించి రిస్క్ తీసుకోకూడదని అతడు భావించినట్లు సమాచారం. ఈ ఏడాది పీఎస్‌ఎల్ సీజన్‌లో మోతీ లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహించాల్సి ఉంది. కానీ ఇప్పుడు అతడు గైర్హజరీలో శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగేను లాహోర్ తమ జట్టులోకి తీసుకుంది. మోతీతోపాటు జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ పాకిస్థాన్ సూపర్ లీగ్ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.