12 May, 2026 | 8:57 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం

12-05-2026 07:54 PM

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి సప్లమెంటరీ పరీక్షల కోసం విద్యార్థులకు రెమిడీయల్ ప్రత్యేక శిక్షణ తరగతులను మంగళవారం ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా పరిశీలకులు హరికృష్ణ, శ్రవణ్ కుమార్ శిక్షణ కేంద్రంను సందర్శించి మాట్లాడినారు.

కోదాడ నియోజకవర్గం 5 మండలాల కోదాడ, అనంతగిరి, చిలుకూరు, మునగాల, నడిగూడెం సంబంధించి పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు వ్రాయునన్న విద్యార్థులు రెమిడీలు శిక్షణా తరగతులకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈనెల 12  నుంచి జూన్ మూడవ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు కాల నిర్ణయ పట్టిక ప్రకారం వివిధ సబ్జెక్టులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపినారు.