ఇంటర్వ్యూల్లో 90 శాతం అవినీతి
- విద్యా, ఉపాధి వ్యవస్థల్లో లోపాలు
- వ్యవస్థలు మెరుగుపడకుంటే మరో ఉద్యమం
- యోగా గురు రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు
డెహ్రాడూన్, ఆగస్టు 15: పాఠశాలలు, కళాశాలల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడం, పేపర్‌లీక్ ఘటనలు, ఇంటర్వ్యూ ల్లో 90 శాతం అవినీతి జరగడంతోనే విద్యార్థులు, యువత వీధుల్లోకి వచ్చి నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారని యోగా గురు రాందేవ్ బాబా ఆరోపించారు. ఇలాంటి నిరసనలు, ఆందోళనలు, ఉద్రిక్తతలు తలెత్తకుం డా ఉండాలంటే వ్యవస్థలను ముందే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరిస్థి తులు మెరుగుపడకపోతే మరో ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. శనివారం ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని పతంజలి యోగా పీఠంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు.
విద్యా, ఉపాధి వ్యవస్థల్లో ఉన్న లోపాలను సూచిస్తున్నాయన్నారు. ఇంటర్వ్యూల్లో అవినీతి వల్ల అర్హులైన అభ్యర్థులు నష్టపోతున్నారని, ఇది యువత ఆగ్రహానికి ఒక కారణమన్నారు. అవినీతి, అక్రమాల వల్ల తమ కుటుంబం వారినో, బంధువర్గాన్నో, కులం వారినో ఉద్యోగాల్లో ఎన్నుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన అభ్యర్థులకు అన్యాయమని, న్యాయానికి విరుద్ధమని ఆరోపించారు. అదే సమయంలో నిరసనల పేరిట అరాచకాన్ని, హింసను సమర్థించనని అన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమలో తాము పోట్లాడుకోవడంమాని దేశ ప్రయోజనాల కోసం పని చేయాలని చెప్పారు. ఈ విషయంలో శత్రువులుగా భావించుకోవద్దన్నారు. భారత్‌లోని అన్ని కులాలు, వర్గాల మధ్య పరస్పరం గౌరవం ఉండాలని పిలుపునిచ్చారు.






