16 August, 2026 | 3:32 AM

స్మార్ట్ కార్డుతో ఇంటికే సంక్షేమం

16-08-2026 12:00 AM
  1. పారదర్శక సేవలతో అక్రమాలకు అడ్డుకట్ట
  2. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

రంగారెడ్డి/ఆదిభట్ల, ఆగస్టు 15 (విజయక్రాంతి): డిజిటల్ పరిజ్ఞానంతో సంక్షేమ ఫ లాలను నేరుగా ప్రజల వద్దకే చేర్చడమే కాకుండా, ప్రజా పంపిణీ వ్యవస్థలో పూర్తి పారదర్శకతను తీసుకొస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా బొంగులూరు సమీపంలో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి ఈ స్మార్ట్ కార్డులు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తాయ ని తెలిపారు. పంపిణీ వ్యవస్థలో అవకతవకలకు తావులేకుండా ప్రభుత్వం అన్ని చర్య లు తీసుకుందని పేర్కొన్నారు. స్మార్ట్ కార్డుల లో క్యూఆర్  కోడ్ ఆధార్ అనుసంధాన డిజిట ల్ వివరాలు పొందుపరిచారని చెప్పారు. లబ్ధిదారులు సరుకులు తీసుకున్న సమయ ం, పరిమాణం డిజిటల్గా రికార్డు కావడం వ ల్ల రేషన్ పక్కదారి పట్టే అవకాశాలు పూర్తిగా మూసుకుపోతాయి చెప్పారు.

ఈ కార్డ్ కేవ లం రేషన్ బియ్యానికే పరిమితం కాకుండా, భవిష్యత్తులో ప్రభు త్వం అందించే సమ స్త సంక్షేమ పథకాలు, పౌర సేవలకు ఒకే ఒక్క ప్రధాన గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలో భాగంగా గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్), రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ప్రభుత్వ ప్రా ధాన్యత పథకాల ప్రయోజనా లు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి మధ్యవర్తులు లేకుం డా వేగంగా అందేందుకు ఈ కార్డు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

పాత కార్డులలో కుటుంబ సభ్యుల పేర్ల నమోదు కు అవకాశం కల్పించడం తో పాటు, కొత్తగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కార్డులు మంజూరు చేస్తూ సంపూర్ణ ఆహార భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, వీర్లపల్లి శంకరయ్య, కలెక్టర్ నారాయణరెడ్డి, జేసీ చంద్రారెడ్డి, పౌరస రఫరాల అధికారి వనజాత  పాల్గొన్నారు.