బేగంపేటలో ఘనంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు
మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు
బేగంపేటలో జెండా ఆవిష్కరణలో దాసరి శివ
రామగిరి, ఆగస్టు 15 (విజయ క్రాంతి): రామగిరి మండలం బేగంపేట గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. నూతనంగా నిర్మించిన స్వర్గీయ శ్రీపాదరావు స్మారక బస్ షెల్టర్ ఆవరణలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా దాసరి శివ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాసరి శివ మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్ బాబు సౌజన్యంతో బేగంపేట గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రేణుక ఎల్లమ్మ దేవాలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణం, నూతన ఐకేపీ కేంద్రం ఏర్పాటు, సిమెంట్ విద్యుత్ స్తంభాలు, బోర్లు, చేతిపంపుల ఏర్పాటు తదితర పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు కలవల శంకర్, మాజీ సర్పంచ్ లక్కర్తి మల్లయ్య, వార్డు సభ్యులు మాతంగి సంజీవరాణి, కుమార్, నేదురు సురేష్, అంకతి కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






