16 August, 2026 | 3:31 AM

ఇంటికి వెళ్లి మీ అమ్మను అడుగు !

16-08-2026 12:03 AM
  1. తండ్రి ఎక్కడున్నాడో చెబుతుంది..
  2. తమిళనాడు బీజేపీ రాష్ట్ర చీఫ్ నాగేంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు
  3. సీఎం విజయ్‌ని ఉద్దేశించి మాట తూలిన నేత

చెన్నై, ఆగస్టు ౧౫: తమిళనాడు రాజకీయాల్లో కొత్త దుమారం రేగింది. ముఖ్య మంత్రి విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ శనివారం కమలాయంలో జరిగిన ఓ రాజకీయ సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీలో తండ్రి ఎక్కడ ఉన్నారని సీఎం వెతకకూడదని, ఇంటికెళ్లి తన అమ్మను అడగాలని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారం రేపాయి. నాగేంద్రన్ వ్యాఖ్యలపై టీవీకే నేతలతో పాటు అన్ని ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. బీజేపీ మాజీ రాష్ట్రచీఫ్ అన్నామలై స్పందిస్తూ.. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం సరికాదని పేర్కొన్నారు. రెండు పార్టీల మధ్య వైరం ఉండవచ్చు.. కానీ, వ్యక్తిగత విమర్శలు తగవని నాగేంద్రన్‌కు హితవు పలికారు.