సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ
12-05-2026 07:57 PM
పాపన్నపేట: మండల కేంద్రమైన పాపన్నపేటలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపును ఏఎంఓ సుదర్శనమూర్తి, మండల విద్యాధికారి ప్రతాపరెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాలుగా ఇస్తున్న వృత్తి నైపుణ్య శిక్షణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా తబలా హార్మోని వాయిద్య కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని విద్యార్థులను అలరించారు. అనంతరం పాపన్నపేటలో నిర్వహిస్తున్న పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు శిక్షణ తరగతులను సైతం వారు పరిశీలించారు.






