15 August, 2026 | 6:06 PM

ప్రజాస్వామ్య విలువలే మన ఆయుధం

15-08-2026 05:24 PM

రత్నాపూర్ లో జెండా ఆవిష్కరణలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్

రామగిరి, ఆగస్టు 15 (విజయ క్రాంతి): 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగిరి మండలం రత్నాపూర్‌లోని మంథని బ్లాక్ కాంగ్రెస్ కార్యాలయ ఆవరణలో స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా తొట్ల తిరుపతి యాదవ్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికి అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు వనం రాంచందర్ రావు, దివ్య సుధాకర్, మాజీ సర్పంచ్, రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తీగల సమ్మయ్య, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు ఎల్లే రామ్మూర్తి, జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ కార్యదర్శి రొడ్డ బాపన్న, మాజీ సర్పంచ్ ఎరుకల ఓదెలు, మాజీ ఉపసర్పంచ్ తొట్ల మధునయ్యతో పాటు రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.